ఎర్రగొండపాలెం లో తెలుగుదేశం శిబిరం కాళీ కాక తప్పదు అసంతృప్తిలో ఉన్న వైసీపీ వారిని ఆకర్షించడం కాదు, మీ పార్టీ సంగతి తేల్చుకోండి:తాటిపర్తి చంద్రశేఖర్

By Khasim
On
ఎర్రగొండపాలెం లో తెలుగుదేశం శిబిరం కాళీ కాక తప్పదు  అసంతృప్తిలో ఉన్న వైసీపీ వారిని ఆకర్షించడం కాదు, మీ పార్టీ సంగతి తేల్చుకోండి:తాటిపర్తి చంద్రశేఖర్

న్యూస్ ఇండియా యర్రగొండపాలెం మార్చి 19:IMG-20240319-WA0826(2)

రాష్ట్రంలో క్రమశిక్షణ గల వైసిపి పార్టీ లో కార్యకర్తలకు నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీని వీడి వారికి కూడా వైసీపీలో చేరిన వారికి కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు మంగళవారం తెదేపా నుండి భారీగా చేరికలు.మనమంతా జగనన్న కుటుంబ సభ్యులమే.కుల మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో సుభిక్ష పాలన అందిస్తున్న జగనన్న పాలనపై ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న చేరికలు ప్రారంభం మాత్రమే అని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో త్వరలోనే భారీ స్థాయిలో చేరికలు జరగనున్నాయని వైఎస్ఆర్సిపి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోనికార్యాలయంలో పుల్లలచెరువు మండలానికి చెందిన తెదేపానాయకులు రావూరి సుబ్బారావు మరియు పట్టణానికి చెందిన కొరపోలు సుందర్ ఆధ్వర్యంలో సుమారు 70 కుటుంబాలు వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న సుభిక్ష సంక్షేమ పాలన నచ్చి స్వచ్ఛందంగా పార్టీలోకి చేరుతున్న ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు జగనన్న కుటుంబ సభ్యులేన ని ప్రతి ఒక్కరికి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెదేపా అవకతవకలు ఉన్నా కూడా వాటిని మరుగున పెట్టి తా మీద బ్రహ్మాండం బద్దలయ్యే రీతిలో చేరికలు చేపడుతున్నామంటూ నిత్యం వార్తలలోకి ఎక్కుతున్నారని ఇటువంటి విషపు ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు. గతంలో చిన్నపాటి అసంతృప్తులను వారి భవిష్యాలలో ఇబ్బందులు పడుతున్న వారిని ఫోన్లు చేసి మరి పిలిపించుకొని కండువాలు కప్పటం రాజకీయమా అంటూ ఆయన ప్రశ్నించారు. రాజకీయాలను హుందాతనంతో చేయాలని కానీ ఆ పార్టీలు లేవని ఆయన విమర్శించారు. సమన్యాయం జగనన్నతోనే సాధ్యమని నమ్మి ప్రతి ఒక్కరు పార్టీలో చేరడానికి ఇతర పార్టీల నుండి భారీగా చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. నైతిక విలువలతో రాజకీయం చేయడం జగనన్న ద్వారానే నేర్చుకున్నానని నేను ఒక్కసారి గేట్లు ఎత్తితే ఆ పార్టీలో ఏ ఒక్కరు ప్రతి ఒక్కరు వైకాపాతీర్థం పుచ్చుకుంటారని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం కార్యకర్తలకు సైతం ఫోన్లు చేసి మరి తమ పార్టీలో చేరాలని కోరడం రాజకీయం అవుతుందా లేక మరొకటి అని ఆయన అన్నారు. జగనన్న అధికారం చేపట్టిన నాటినుండి ప్రజల కోసమే పని చేశారని అందుకే మరో మారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చూడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్సిపి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం నేరుగా ప్రజల దరి చేరింది కాబట్టి రాష్ట్రంలోని ప్రజలంతా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీలో నాయకులకు కార్యకర్తలకు విలువ ఉంటుందని కానీ తెదేపాలో ఏ ఒక్కరికి విలువ ఉండదన్నారు. అందుకే వారు విలువ ఉన్న పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు పేర్కొన్నారు. చేరికలు చేర్చుకోవడం చేర్చుకున్న వారిని ఆదరించటం ప్రతి ఒక్కరికి సమన్యాయం కల్పించడం ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి తోనే సాధ్యమన్నారు ప్రస్తుతం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా నిలబడతానని భరోసా కల్పిస్తానని ప్రతి ఒక్కరికి ప్రాధాన్య ఇస్తానని సమంత జగనన్న కుటుంబమే అంటూ ఆయన తెలిపారు. కానీ తెదేపాలో నాయకత్వంలో కొట్టవ చ్చినట్లుగా కనబడుతుంది అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ తొక్కే సత్తా చంద్రబాబుకు లేదని నడిపే సత్తా లోకేష్ కు కూడా లేకపోవడంతో పరువు తెచ్చుకున్న నాయకుడిని తెచ్చుకున్నారని ఆయన సైతం తొక్క లేక మరొకరికి అప్పగించారని ఎద్దేవా చేశారు జెండాలు పట్టుకోవడం చేతకాని మహా కూటమి రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేకూరుస్తుందని ఆయన అన్నారు. తాము చెప్పిందే చేస్తాం అంటూ జగనన్న మీకు మేలు చేకూరు తేనే ఆదరించాలని కోరడం శాసనసభ్యులు సైతం ఇంటి వద్దకు రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కాదన్నారు. ప్రజలకు న్యాయం చేశాడు కనుకనే ప్రజల వద్దకు వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని చెబుతున్న పచ్చ పత్రికలకు మీడియాకు రాష్ట్రంలో అమలు చేసిన 17 మెడికల్ కాలేజీలు చిన్నారుల భవిష్యత్తు కోసం 70 వేల కోట్ల రూపాయలతో పాఠశాలల పునరుద్ధరణ 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం రైతు భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకటేమిటి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. నియోజకవర్గ విషయానికి వస్తే 1,40,000 మంది ఓటర్లు ఉంటే 1,67 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చేసిన సంక్షేమ పథకాలను కులాలు పార్టీలకు అతీతంగా అందజేసి ధైర్యంగా ఓటు అడిగే సత్తా ఉన్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నారు. రానున్న రోజులు మనమేనని మరో వారం రోజులలో నియోజకవర్గంలో వేల మంది చేరికలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మండల కన్వీనర్ కొప్పర్తి చిన్న ఓబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెన్న హనుమారెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తి రెడ్డి ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ జడ్పిటిసి చేదురి విజయభాస్కర్ సర్పంచ్ రామావత్ అరుణబాయి మాజీ ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి నాయకులు జబీబుల్లా సాబీర్ భాష ఇతరులు పాల్గొన్నారు.

Views: 33
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
*👉కాంగ్రెస్ చెప్పే మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో* *👉కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి!* *👉సమిష్టిగా కృషి చేస్తే వరంగల్ పార్లమెంట్ మనదే..ఉద్యమకారుడు మారేపల్లి...
కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
ఇంటర్ లో పేయిల్ అయ్యానని మనస్థాపనతో విద్యార్థిని ఆత్మహత్య
గుడుంబా స్థావరాలపై విస్తృతస్థాయి దాడులు
అట్టహాసంగా తాటిపర్తి నామినేషన్ కార్యక్రమం
గుడుంబా స్థావరాలపై దాడులు
గుడుంబా స్థావరాలపై దాడులు