అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న వేళ ఐటిపాముల గ్రామంలో ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

On
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న వేళ ఐటిపాముల గ్రామంలో  ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

న్యూస్ ఇండియా,తెలుగు జనవరి 22 (నల్లగొండ జిల్లా ప్రతినిధి,బెల్లీ శంకర్): అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న వేళ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటపాముల గ్రామంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో వేద పండితులు ఉప్పల భరద్వాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ చౌగోని నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలోని కోట్లాదిమంది ప్రజల స్వప్నం సహకారమైందని అన్నారు. ఈరోజు సాయంత్రం ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలని అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు వేద పండితులతో,మీద వేసుకోవాలని శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహా మంత్రంను అందరు కలిసి 108 సార్లు జపించాలి అని తెలియజేశారు.కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు పులిహోర దాత బెజవాడ సరోజన సైదులు, శ్రీరాముని జెండాలు దాత చౌగొనీ తిరుమలేష్ ,సున్నపు రమేష్, దేవస్థానానికి తోరణాల దాత,మాజీ సర్పంచ్ పెద్ది సుక్కయ్య,తండు అంజయ్య,ఎంపీటీసీ బెల్లీ సుధాకర్,మిట్ట లక్ష్మారెడ్డి,గుడిపాటి రవి,జూలూరి నాగరాజు,పెద్ది జగన్,సున్నపు సైదులు సున్నపు యాదయ్య,రాజు,శివ,గణేష్ లు వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 222

About The Author

Post Comment

Comment List

Latest News