ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం..

ప్రారంభించిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

On
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం..

మన్నెగూడ లో ఆర్టీఓ కార్యాలయం ప్రారంభం

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం..

ప్రారంభించిన రవాణా,

IMG-20240118-WA0132
ప్రారంభించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...

ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేలా సమగ్ర మార్పులు తెస్తాం..

Read More అనాధలకు అండగా

రవాణా శాఖ ద్వారా ప్రతి పౌరుడికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ఇత్యాది రూపాల్లో మెరుగైన సేవలందించేలా కార్యాచరణ..

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

ఇబ్రహీంపట్నం, జనవరి18 (న్యూస్ ఇండియా తెలుగు): ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా శాఖలో ప్రక్షాళనను చేపట్టి సమగ్ర మార్పులు చేయనున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థ ద్వారా సేవలు అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందన్నారు.రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ
ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ. 2.15 కోట్ల సి.ఎస్.ఆర్ నిధులను వెచ్చిస్తూ రామోజీ ఫౌండేషన్ నూతనంగా నిర్మించిన ఆర్టీవో కార్యాలయాన్ని
మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నానాటికి విస్తరిస్తున్న నేటి సమాజంలో సగటు మనిషి జీవితంతో పోలిస్తే, వాహనాల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోందన్నారు. 2014లో 71 లక్షలకే పరిమితమైన వాహనాల సంఖ్య, నేడు కోటీ 60 లక్షలు దాటిందంటే వాహనాల విస్తృతిని అర్ధం చేసుకోవచ్చని అన్నారు.పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగానే రోడ్డు భద్రత అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు అంతర్భాగంగా మల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేనిపక్షంలో ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం 22 వేల ప్రమాద సంఘటనలు చోటు చేసుకుని మూడు వేల మంది తమ విలువైన నిండు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం ఎంత అవసరమో,భద్రత కూడా అంతే ముఖ్యమని మంత్రి నొక్కి చెప్పారు.రవాణా శాఖ ద్వారా ప్రతి పౌరుడికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ఇత్యాది రూపాల్లో మెరుగైన సేవలందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఇప్పటికే కంప్యూటరీకరించబడిన 59 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని  గుర్తు చేశారు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేలా సమగ్ర మార్పులు తెస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు 9 కోట్ల జీరో వ్యాల్యూ టికెట్స్ జారీ చేయడం జరిగిందన్నారు. సంక్రాంతి పండుగకు ఉచిత రవాణా సదుపాయం కల్పించిన తరహాలోనే సమ్మక్క సారక్క జాతరకు, ఇతర పండుగలు, పుణ్యక్షేత్రాల సందర్శన వంటి వాటికి కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయమై కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. ఇదివరకు మెట్రో, ఓలా, ఉబర్ క్యాబ్ వచ్చిన సమయంలో మిన్నకుండిపోయిన వారు నేడు అనవసర ఆందోళన వెలిబుచ్చుతున్నారని అన్నారు. అయినప్పటికీ ఆటో రిక్షా ఆపరేటర్ల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, వారి సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ఆటో యూనియన్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఇతర సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలోనూ మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు.ఇబ్రహీంపట్నం శాసన సభ సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా ప్రాంతీయ రవాణ కార్యాలయమును నేడు ప్రారంభించుకోవడం జరిగినదని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలను దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ స్థలమును ఎంచుకోవలసి వస్తుందని అన్నారు. అతి త్వరలో మున్సిపల్ కార్యాలయమును ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలకై అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల శ్రేయస్సు కొరకు ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ 6 ఎకరాలలో రామోజీ ఫౌండేషన్ సహకారంతో 2 కోట్ల నిధులతో నూతనంగా ప్రాంతీయ రవాణ కార్యాలయమును అత్యాధునిక పద్దతిలో నిర్మించుకొని,  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. మనుషుల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో వాహనాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. జిల్లాలో రవాణ శాఖ కార్యాలయాలు స్వంత భవనాలలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతీయ రవాణ కార్యాలయము ఇబ్రహీంపట్నం నియోజకవర్గములోని 11 మండలాల పరిధిలోని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.  రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ద్వారా 1526 కోట్ల రెవెన్యూ సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫౌండేషన్ ప్రతినిధి విజయేశ్వరి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బోగారపు దయానంద్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రవీణ్ రావు,
స్థానిక రవాణా శాఖ అధికారి రఘునందన్ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్, వైస్ మున్సిపల్ చైర్ పర్సన్ హరిత ధన్ రాజ్ గౌడ్, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి,టీపీసీసీ కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్, వరికుప్పల సుధాకర్, కోడూరి రమేష్,ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 312

About The Author

Post Comment

Comment List