తీవ్ర నిరాశలో పాయకరావుపేట వైసీపీ అభ్యర్ధి కంబాల జోగులు?
కంబాల జోగులుపై తీవ్ర వ్యతిరేకత
పాయకరావుపేట వైసీపీలో ఎవరిదారి వారిదే నాన్ లోకల్ వద్దు..లోకల్ ముద్దు అంటున్న స్థానికులు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ కేడర్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల మార్పు ఆ పార్టీ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును మార్చి.. శ్రీకాకుళం జిల్లా రాజం ఎమ్మెల్యేను పాయకరావుపేటకు ఇంఛార్జిగా నియమించారు. దీంతో స్థానికంగా వైసీపీ కేడర్ భగ్గుమంటోంది. లోకల్ నాయకులు టికెట్ ఇవ్వకుండా బయటివాళ్లకు టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక వైసీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులుగా ఉన్న వైసీపీ కేడర్..ఇప్పుడు 13 గ్రూపులుగా మారింది. వైసీపీలో తాజా ముసలం.. టీడీపీకి ఉపయోగపడేలా ఉంది. వైసీపీకి ఓటమి తప్పదని.. కంబాల జోగులుకు పార్టీ నేతలు ఎవరూ సహకరించరని.. నాన్ లోకల్ కు టికెట్ ఇవ్వడం వల్ల వాళ్లంతా టీడీపీ వైపు వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ నాన్ లోకల్ అభ్యర్ధిని పెట్టి.. స్వయంగా ఓటమిని కొని తెచ్చుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List