వరుస రోడ్డు ప్రమాదాలతో వణికిపోతున్న ప్రజలు
మార్కాపురం డివిజన్/న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి.ప్రమాదానికి కారణం ఏమిటి ఎవరు అనేది పక్కన పెడితే ప్రతి చిన్న ప్రమాదంలో ను ప్రాణ హాని తప్పటం లేదు.డిసెంబర్ మాసం సగం నుండి నేటి వరకు ఎదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదపు వార్తలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోమరోలు, గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, జగంగుంట్ల, సోమవారిపేట ఇలా వేరు వేరు ప్రాంతాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగాయి.అయితే ప్రతి ప్రమాదంలోనూ ప్రాణ నష్టం జరిగిన విషయం డివిజన్ లోని ప్రజలను కలచివేస్తుంది.జరిగిన అన్ని రోడ్డు ప్రమాదాలూ కారు, ద్విచక్రవాహనాలకు మాత్రమే ఎక్కువ మొత్తంలో జరిగాయి.దీంతో ప్రజలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయుటకు భయపడుతున్నారు.మరి కొందరైతే ఈ నూతన సంవత్సరం సరిగా లేదని, అరిష్టం అని మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారు.ఎదేమైనప్పటికి వరుస రోడ్డు ప్రమాదాలను అరికట్టుటకు ప్రభుత్వ నియమ,నిబంధనలను అనుసరించి ప్రయాణం చేయుట.. ఒక మంచి అవకాశం అని, అలానే డ్రైవింగ్ సరిగా రాని వారు ప్రధాన రహదారులపై కి రావటం నిలిపివేయాలి అనేది, అతి వేగం తగ్గించాలి అనేది ప్రజలు తెలుసుకోవటం చాలా అవసరం.
Comment List