పాయకరావుపేటలో వైసీపీ కేడర్ ను ఏకం చేస్తున్న పెదపాటి అమ్మాజీ
నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధులతోపాటు సీనియర్లతో అమ్మాజీ వరుస భేటీలు
ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చే వ్యూహంలో వైసీపీ ఉంది. దీంతో పాయకరావుపేటలో అమ్మాజీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మరో మూడు నెలల సమయమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే పాయకరావుపేటలో పెదపాటి అమ్మాజీ సుడిగాలి పర్యటనలతో ఇన్నాళ్లూ తలోదారిగా ఉన్న వైఎస్ ఆర్ సీపీ కేడర్ అంతా ఒక తాటిపైకి వస్తున్నాయి.
గతంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబూరావు తీరుతో చెల్లాచెదురైన కార్యకర్తలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఇప్పుడు అమ్మాజీ కి మద్దతుగా నిలుస్తున్నారు.
దీంతో జగన్ మోహన్ రెడ్డి కూడా పెదపాటి అమ్మాజీకే టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List