రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
వీటి ద్వారా 21,079 మందికి కొత్తగా ఉద్యోగ ఆవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడి
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్‌లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఏర్పాటు చేసిన సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో–ఇథనాల్ తయారీ యూనిట్‌లను ప్రారంభించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ఏర్పాటు చేయనున్న 17 ప్రాజెక్టుల్లో గుంటూరు, హిందూపూర్, మచిలీపట్నంలో రూ.670 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో స్టార్చ్ ప్రాసెసింగ్ యూనిట్, విజయనగరం, కర్నూలులో ఏర్పాటు చేసే ఆర్టీఈ/ఆర్టీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.
"పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోంది. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. 386 ఎంఓయూలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో చేసుకున్నాం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభదశలో ఉన్నాయి" సీఎం జగన్
పారిశ్రామిక వేత్తలకు మన ప్రభుత్వం చేయూతనిస్తుంది. నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయని, వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి అడుగులోను కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలని, ఈనాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగామని,. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 86 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామని, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఎప్పుడూ చూడని అడుగులు వేశామని కోవిడ్ సమయంలోకూడా కుప్ప కూలిపోకుండా వారికి చేయూత నిచ్చామని ్న్నారు
1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయని, 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయని సీఎం తెలిపారు. మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యిందని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేవలం మనం ఫోన్‌కాల్‌దూరంలో ఉన్నామని, వారిపట్ల సానుకూలతతో ఇదే పద్ధతిలో ఉండాలని అధికారులకు సీఎం చేప్పారు. 9 ప్రాజెక్టుల్లో 3 శంకుస్థాపన చేస్తున్నామని, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దాదాపు 1100 కోట్ల పెట్టుబడితో, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి సృష్టించగలిగాం అని అన్నారు. పత్తికొండకు తాను హామి ఇచ్చినట్టే అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ మేరకు ఇవాళ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపనచేస్తున్నామని అన్నారు. అధికారులు మంచి కృషిచేశారని కొనియాడారు. అంతే వేగంగా అడుగులు ముందుకేయాలని సూచించారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా శుభాకాంక్షలు తేలిపారు. ఎంఎస్‌ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నామని వెల్లడించారు.
Comment List