సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి.

ప్రచారంలో మాట్లాడుతున్న శంకర్ నాయక్.

On

పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శంకర నాయక్ ఉపసర్పంచ్ల్ : వల్లెపు నాగరాజు.

టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని పథకాల తెచ్చిన మహోన్నత నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే అని అలాంటి సంక్షేమ పథకాలు వల్లనే టిఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని గూడూరు మండల పలు గ్రామాలలో కలిగే తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీ మానుకోట అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ ప్రచారంలో అన్నారు. గూడూరు మండలంలో ప్రచారానికి ముందు కొత్తగూడెం మండలం గుంజేడు ముసలమ్మ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి పథంలో ముందుండి కార్యకర్తలను ప్రజలకు అండగా ఉండుకుంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని గ్రామాలు ప్రచారంలో తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీలో ప్రజలందరికీ ఆసరా పింఛన్లు గృహలక్ష్మి దళిత బంధు పేదలకు డబుల్ బెడ్ రూములు ఎన్నో పథకాలు టిఆర్ఎస్ పార్టీకి ధైర్యం చెబుతున్నాయని కాంగ్రెస్ బిజెపి కల్లబొల్లి మాటలకు ఆశపడకుండా టిఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రతి తండా గ్రామ మండల మొత్తం అభివృద్ధి పయనంలో నడిచిందని ఏ పాలనలో ఎవరు అభివృద్ధి చేశారో గుర్తించాలని టిఆర్ఎస్ కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నదని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ ప్రచారంలో తెలిపారు. జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి కాసిం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో 10 నుండి 20 వేల మెజారిటీ తో బానోత్ శంకర్ నాయక్ ను గెలిపించి మరింత గూడూరు మండలాన్ని అభివృద్ధి చెందేట్టుగా గెలిపించాలని మూడోసారి కూడా గెలిపించి మంత్రిగా చూడాలని గూడూరు మండల ప్రజల కోరిక అని మీ వంతు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా వారు కోరారు. గూడూరు మండలంలోని చిన్న ఎల్లాపూర్, భూపతి పేట వేంగంపేట, సీతానాగరం, కోబల్ తండా,లైన్ తండా లలో శంకర్ నాయక్ పర్యటించి ప్రజలతో ముచ్చటించి ఇంకా అభివృద్ధి చేసుకునే తండాల గ్రామాలు ఉన్నాయని ఇంతలోనే ఎలక్షన్ రావడం వల్ల అవి ఆగిపోవడం జరిగిందని ఎలక్షన్ అయిపోయిన నెల రోజుల్లోనే మళ్లీ ఈ తండాలను గూడాలను తిరుగుతూ అభివృద్ధి చేస్తానని, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటానని ఆయన అన్నారు. మరిమిట్ట గ్రామంలో ఉప సర్పంచ్ వల్లెపు నాగరాజు ఆధ్వర్యంలో శంకర్ నాయక్ ఘన స్వాగతం పలికి పూలతో అభిషేకం చేసి మంగళ హారతులతో శంకర్ నాయక్ నీరాజనం పలికారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ మరిమిట్టలో జాతీయ రహదారి నుండి బంధాలగడ్డకు వెళ్లాడానికి రోడ్డు అడిగారని రోడ్డు వెంటనే సాంక్షన్ చేసామని ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా చేయని పని టిఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తున్నదని అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నదని 3 గంటల కరెంటు మాత్రమే రైతులకు ఇస్తుందట అని మరి 3 గంటల కరెంటు కావాలా 24 గంటల కరెంటు కావాలా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని టిఆర్ఎస్కు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని శంకర్ నాయక్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి కాసిం, సీనియర్ నాయకులు జలగం సంపత్ రావు, వాంకుడోత్ కటార్ సింగ్ ,మండల అధ్యక్షులు వేం వెంకట కృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి బానోతు నరసింహ నాయక్, టౌన్ అధ్యక్షులు చీదురు వెంకన్న ,మండల యూత్ అధ్యక్షులు కోడి రవి ,టౌన్ యూత్ అధ్యక్షులు నూకల అశోక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 108

About The Author

Post Comment

Comment List