కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ

జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

On
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ

పాల్గొన్న ఎస్పీ, ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరో నరేష్)అక్టోబర్ 15: ముఖ్యమంత్రి కప్-2024 టార్చ్ రిలే ర్యాలీని మంగళవారం కొత్తగూడెం సెంట్రల్ పార్క్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. సెంట్రల్ పార్క్ నుండి ప్రకాశం స్టేడియం వరకు టార్చ్ రిలే ర్యాలీ కొనసాగింది. ఈ ప్రారంభం కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువత చెడు వ్యసనాలకు బారిన పడకుండా క్రీడల వైపు మొగ్గు చూపేలా ఉండటమే అని అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలలో కొనసాగుతున్న టార్చ్ ర్యాలీ 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకొని భద్రాద్రి కొత్తగూడెంనికి చేరుకుంది అని తెలిపారు. స్పోర్ట్స్ అనేది ఒక వ్యసనంగా మలుచుకోవాలన్నారు. రానున్న రోజులలో భద్రాద్రి జిల్లా క్రీడలలో మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. క్రీడలను పెంపొందించడానికి క్రీడాకారులకు సంబంధించిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ ఎం.పరంధాములు, డిస్టిక్ ఒలంపిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ కే.మహీధర్,గుమలాపురం సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, డీఎస్పీ రెహమాన్, క్రీడాకారులు,IMG20241015072944 క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

Views: 90
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి