ముగిసిన విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు...!

గడిచిన తొమ్మిది రోజుల పాటు గ్రామ దేవతలకు వివిధ రూపాల అలంకరణతో ప్రత్యేక పూజలు.

On
ముగిసిన విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు...!

- ఆలయ పూజారి విశ్వబ్రాహ్మణ నరసింహాచారి...

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 12 :- ఈ శనివారం ఘనంగా జరిగిన దసరా పండుగ మహోత్సవంతో మండలంలో ముగిసిన విజయదశమి తొమ్మిది రోజుల శరన్నవరాత్రి ఉత్సవాలు. అశ్వయుజ మాసం శుక్లపచ్చం విజయదశమి రోజున మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలోని శ్రీ శ్రీ కాలికాదేవి అమ్మవారికి శనివారం ఉదయం కమ్మరి పరమేశ్వరాచారి కుటుంబ సభ్యులు కలిసి అమ్మవారికి జాలాభిషేకం,కుంకుమార్చన, నూతన వస్త్రాభరణములు, ఆకుపూజ అలంకరణతో వడిబియ్యము సమర్పించి, శ్రీ కాళికాదేవిని రాజేశ్వరి దేవిగా అలంకరణతో పూజించారు. అలాగే గ్రామంలో వెలసిన శ్రీ పెద్ద లక్ష్మమ్మ దేవి మరియు శ్రీ చిన్న లక్ష్మమ్మ దేవతలకు మండల టీడీపీ నాయకుడు దిద్దికాటి మల్లికార్జున దంపతులు మరియు ఉప్పర రఘువీర దంపతులు కలిసి అమ్మవార్లకు తెచ్చిన నూతన వస్త్రాలు, పూలు, పండ్లు మరియు ఒడిబియ్యంతో ఆలయ పూజారి విశ్వబ్రహ్మన నరసింహాచారి చేతుల మీదుగా దేవతలను రాజ రాజేశ్వరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. శనివారం విజయదశమి రోజున గ్రామ దేవతలకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి, మహా మంగళహారతితో దేవతలను ప్రత్యేక అలంకరణతో పూజించడం జరిగింది. అనంతరం శ్రీ కాళికాదేవి విగ్రహంను గ్రామ పూర వీధులలో భాజ భజన్త్రీలతో ఊరేగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్ద ప్రసాదములు స్వీకరించి, తమ మొక్కులు తీర్చుకున్నారు.IMG_20241012_190345

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News