పాలకుర్తిలో పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం. 

బాధితుడికి న్యాయం జరగాలని బంధువుల గిరిజన సంఘం నాయకుల దర్నా.

పాలకుర్తిలో పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం. 

పాలకుర్తిలో పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం. 

బాధితుడికి న్యాయం జరగాలని బంధువుల గిరిజన సంఘం నాయకుల దర్నా.

బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నంలో జనగాం డిసిపి 

రోడ్డు పైనే చితిపేరుస్తున్న బంధువులు

Read More PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో గిరిజన సంఘ నేతలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీసులు భారీగా మోహరించారు. బాధితులు ఆందోళన చేపట్టడంతో పాటు పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఈ ఆత్మహత్య కారణమైన పాలకుర్తి ఎస్ఐ సిఐని సస్పెండ్ చేసి ఎస్ఐ కి ఫోన్ చేసిన పార్టీ నాయకులకు శిక్షపడేలా చర్య చేపట్టాలని ధర్నా చేశారు పోలీసులకు బంధువులకు తండావాసులు మధ్య చాలా సేపు తోపులాట జరిగింది. పోలీసులు బాధితులను అడ్డుకొని ఆపారు. సంఘటన స్థలానికి జనగం డిసిపి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు బంధువులకు సముదాయించే ప్రయత్నం చేశారు అయినా వినకుండా రోడ్డుపైనే చితి పేర్చడం ప్రారంభించిన బంధువులు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ముందు మెయిన్ రోడ్డుపై జరగడం వల్ల రాదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. 

Read More అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..

Views: 409
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News