ఇల్లందులో "విలేఖరి" పై దాడి

రాజకీయ కోణమా ... పాతకక్షల...?

On
ఇల్లందులో

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇల్లందు (న్యూస్ ఇండియా) అక్టోబర్ 18: ఇల్లెందులో మారణఆయుధాలతో విలేకరి పై దాడి చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొంతమంది  దుండగులు ఎన్. సుదర్శన్ అనే విలేకరిపై మారణయుధాలతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వేలుగులోకి వచ్చింది. ఇందుకు  సంబంధించిన పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దుండగులు చేసిన దాడిలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మెరుగైన  చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. అయితే సుదర్శన్ పై దాడి పాత కక్షల నేపథ్యంలోనే జరిగి ఉంటుందని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడికి సంబంధించి ఇల్లందు జర్నలిస్టులతో పాటు జర్నలిస్టు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షల నేపథ్యంలోను ఈ దాడి జరిగి ఉంటుందన్న అనుమానాలు సైతం పాత్రికేయులు, కుటుంబీకులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్  ప్రభుత్వం హయాంలోనూ సుదర్శన్ కు పలు తగాదాలు ఉన్నట్లు ఆ కోణంలోనూ దాడి జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. విలేఖరి పై దాడిని IMG-20241018-WA1097 పోలీసులు సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 465
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News