TS rtc charges: తెలంగాణలో మళ్లీ బస్సు ఛార్జీల మోత

On

TS rtc charges: ఇప్పటికే ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో మరోసారి సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. కిలోమీటర్‌ వారీగా పెంచిన డీజీల్ సెస్‌ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి గ్రేటర్ పరిధిలో మినహా అన్ని రకాల ఆర్టీసీ బస్సులో అదనపు డీజీల్ సెస్ వసూలు చేయనున్నారు. ప‌ల్లె వెలుగులో 250 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 45 రూపాయలు పెంచారు. ఇక ఎక్స్‌ప్రెస్‌ బస్సులో […]

TS rtc charges: ఇప్పటికే ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో మరోసారి సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. కిలోమీటర్‌ వారీగా పెంచిన డీజీల్ సెస్‌ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి గ్రేటర్ పరిధిలో మినహా అన్ని రకాల ఆర్టీసీ బస్సులో అదనపు డీజీల్ సెస్ వసూలు చేయనున్నారు.

ప‌ల్లె వెలుగులో 250 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 45 రూపాయలు పెంచారు. ఇక ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 500 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంచారు. డీల‌క్స్‌లో 500 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 125 రూపాయలకు పెంచగా.. సూప‌ర్ ల‌గ్జరీలో 500 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి 130 రూపాయలకు పెంచారు. ఏసీ బస్సుల్లో 500 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి 170 రూపాయలు పెంచింది తెలంగాణ ఆర్టీసీ. అయితే తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు విధించారు.

ఇక.. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపులేదని ప్రకటించింది టీఎస్‌ఆర్టీసీ. దీంతో గ్రేటర్‌ బస్సుల్లో ప్రయాణీకులపై ఎలాంటి ప్రభావం ఉండదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అదనపు డీజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. గతంలో రౌండప్‌, టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి