గుడుంబా స్థావరాలపై విస్తృతస్థాయి దాడులు

ఒకేసారి నాలుగు మండలాల్లో 8 టీంలు దాడులు... •మొత్తం 150 మందిపై కేసు నమోదు •120 మంది అరెస్ట్.. బైండోవర్ 840 మంది

గుడుంబా స్థావరాలపై విస్తృతస్థాయి దాడులు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృతస్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎక్సైజ్ పరిధిలోని వివిధ మండలాలలో విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పలువురుపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు తెలిపారు. బుధవారం తొరూర్ ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అంజాన్ రావు మాట్లాడుతూ...ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సారాధ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎక్సైజ్ స్టేషన్ , స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలోని నాటుసారాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించటం జరిగిందని డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు అన్నారు. తొర్రూరు స్టేషన్ పరిధిలోని  ముబ్బ తండా, తానియా తండా, తుల్య తండా, సామార్చకుంట తంకా.. గుండెపూడి, వీరారం, జరుపుల తండా, తావుల తండా, జలావత తండా, జండాల తండా, బాత్తల తండా, ఆకసీట్, మేత్య తండా, దేఖ్య తండా, తూర్పు తండా, చారితండా, పడనుటి గూడెం గ్రామాలలో మొత్తం 8 టీములుగా విడిపోయి నాలుగు మండలాలలో దాడులు నిర్వహించి 24 వ్యక్తులపై కేసులు నమోదు చేసి, 14 మందిని అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. మరియు 140 లీటర్ల నాటుసారాయిని,500 కిలోల బెళ్ళంను స్వాధీనం చేసుకొని,10,20 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయటం జరిగిందని తెలిపారు.అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు మొత్తం కేసులు 150 నమోదు చేయడం జరిగిందన్నారు.120 అరెస్ట్ చేశామని,1150 లీటర్ల నాటు సారాయి,35150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామని,2280 కిలోల బెల్లం,210 కిలోల పటిక, 563 లీటర్ల మద్యం,17 ద్విచక్ర వాహనంలు,స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.అదేవిధంగా 840 మందిని ఎమ్మార్వో ముందు బైండవర్ చేశామని,మొత్తం స్వాధీనం చేసుకున్న విలువ 59 లక్షల 30 వేయులు ఉంటుందని డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు తెలిపారు. ఈ దాడులలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు, ఏఈఎస్ ఆర్ ప్రవీణ్,ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్,పాలకుర్తి సీఐ సంతోష్ రెడ్డి,మహబూబాబాద్ సిఐ చిరంజీవి,గూడూర్ సిఐ బిక్షపతి,డిటిఎఫ్ సిఐ నీరజ,ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగేశ్వరరావు,వరంగల్ అర్బన్ సీఐ,తొర్రూర్ ఎస్సై తిరుపతి,అనిల్,డిటిఎఫ్ ఎస్ఐ కిరీటి,మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Views: 44
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ
జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందిందని ప్రజలందరూ జగన్ అన్నకు అండగా నిలవాలని కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ అన్నారు. హనుమంతునిపాడు మండలం...
వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..
మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..
భువనగిరిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం : పబ్బు వెంకటేశ్వర్లు
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ