మాజీ సీఎం కెసిఆర్ మతిమరుపు మాటలు...

డి. వై. గిరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి

మాజీ సీఎం కెసిఆర్ మతిమరుపు మాటలు...

IMG-20240503-WA0045
*జిల్లాల కుదింపు రేవంత్ రెడ్డి అన్నారా.... విషపు ప్రచారంతో అందలం ఎక్కలేరు....*
*మహబూబాబాద్ జిల్లా రద్దు అంటూ మతిభ్రమించే కెసిఆర్ మాయలోడి మాటలు నమ్మొద్దు...*

*డి. వై. గిరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి*

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు రద్దు చేస్తున్నారని అంటూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మతిబ్రమించి మాట్లాడటం అయన రాజకీయ పరిపక్వతకు తగింది కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డి. వై. గిరి అన్నారు.
మహబూబాబాద్ పట్టణంలో జరిగిన కెసిఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు కేవలం కెసిఆర్ తన అధికార దాహం కోసం మాట్లాడినవేనని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా త్వరలో రద్దు అవుతుందంటూ పదే, పదే జనాన్ని రెచ్చగొట్టడం కెసిఆర్ అవివేకం అన్నారు. వెన్నరం కాలువలు త్రవ్వింది కాంగ్రెస్ పార్టీ అని దానిలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇచ్చి ఆయా కాలువలు త్రవ్వింది నేనే అంటూ ప్రజలను తప్పు త్రోవ పట్టించడం కెసిఆర్ మాయల మారాఠి అని అర్ధం అయిందని డి. వై. గిరి అన్నారు. సెంటిమెంట్ విషయాలతో జనాన్ని రెచ్చగొట్టుడు, మసీపూసి మారేడు కాయ అని నమ్మించుడు కెసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని అయన విమర్శించారు. 

తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ 17 జిల్లాల డిక్లరేషన్ ఇచ్చినప్పుడు నేను కెసిఆర్ తోనే తాను ఉన్నాని, తెలంగాణ వచ్చాక తన జిమ్ముక్కుల కోసం ఇబ్బడి మబ్బిడిగా జిల్లాలు ఇచ్చి పాలన అస్తవ్యష్టం చేసింది కెసిఆర్ కాదా... కేంద్రం జిల్లాల గుర్తింపు, ఐఏఎస్ ల, ఐపీఎస్ కేటాంపులు లేకున్నా డివిజనల్ ఆర్. డి. ఓ, డీఎస్పీల స్థాయి ఉన్న వాటిని జిల్లాలు చేసి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి ఎస్పీలు, కలెక్టర్ లు విధులు నిర్వహించే స్థానాలలో ప్రమోషన్ లు ఇచ్చి నాన్ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ లతో తన ఇష్టం వచ్చినట్లు పాలన చేసింది కెసిఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు.  

Read More ఘనంగా పల్లా సతీష్ రెడ్డి జన్మదిన వేడుక

డి. బి. ఎం 48 వెన్నవరం, డి. బి. ఎం. 68 తల్లంపాడు, డి. బి. ఏం 78 మోరాంచ ఉప కాలువలు, ఎస్.ఆర్.ఎస్పీ కాకతీయ కాలువలు త్రవ్వింది కాంగ్రెస్ ప్రభుత్వమని, బడా బహుళర్ధక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలని ముఖ్యమంత్రిగా పని చేసిన కెసిఆర్ కి తెలియదా అని డి. వై. గిరి ఏద్దేవా చేశారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోసే ఎత్తి పోతల పథకాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అని ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము దండుకున్న కెసిఆర్ ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేసాడో... ఎలా నిర్మించాడో ప్రజలకు తెలుసనీ ఆయన చెప్పారు. కుంగిన డ్యామ్ ఆయా పనులు చేసేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం నీళ్లు తీసి డ్యామ్ పనులు చేపించి వచ్చే సీజన్ లో వ్యవసాయం కోసం నీళ్లు ఇచ్చే పనిలో ఉంటే, మీ కాలువల్లో నీళ్లు వచ్చాయా లేదే... అంటూ ప్రజలకు తప్పుడు సాంకేతలు ఇస్తున్న కెసిఆర్ మాయ మాటలు మానుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. 

Read More ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి

కెసిఆర్ ప్రభుత్వం నూతన మహబూబాబాద్ జిల్లాను వ్యతిరేకించినప్పుడు జిల్లా స్థాయి ఉద్యమం చేసి కెసిఆర్ మెడలు వంచి జిల్లాని తెచ్చుకుంది ఇక్కడి ప్రజలేనని, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో  మహబూబాబాద్ జిల్లా కోసం ప్రజా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ తరపున మేమే అని, రెండు బజార్లు లేని మహబూబాబాద్ ని జిల్లా చేయాలా అని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కరుణని హేళనగా మాట్లాడింది కెసిఆర్ యేనని, అటువంటి కెసిఆర్ జిల్లాలు రద్దు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి పైన అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని డి. వై. గిరి అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, జాతీయ రహదారులు, పలు రైళ్లు హల్ టింగ్స్, మోడల్ స్కూల్స్, పేదల ఉచిత రైలు ప్రయాణాలు తెచ్చి ఇప్పించి, తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో నినదించిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ని మించిన అభివృద్ధి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత ఏం చేసిందో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుందని ఆయన అన్నారు. 

Read More పులిగిల్ల గ్రామం లో కొనసాగుతున్న ఎన్నికల సందడి

తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పెట్టిందే కాకుండా లక్షలాది రూపాయల కోట్ల అప్పులు చేసి ప్రజలపై రుద్ది 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది అంటున్న కెసిఆర్ కి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల పెంపు, రైతు బందు గురించి మార్చి నెలలో బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన విషయం అసెంబ్లీకి పోనీ కెసిఆర్ కి తెలియకపోవచ్చని, కనీసం ఆయన అల్లుడు, కొడుకునైనా తెలుసుకొని మాట్లాడితే కెసిఆర్ బాగుండేదని డి. వై. గిరి చెప్పారు. బడ్జెట్ అయిపోయి ఏప్రిల్ నెలలో పెన్షన్లు, రైతు బందు పెంపు ఇచ్చే లోపున పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఆగిపోయింది ప్రజలు గ్రహించాలని, కెసిఆర్ గారడి మాటలు ప్రజలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుతుందని, ఈ మేరకు పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో కెసిఆర్, బి. ఆర్. ఎస్ కుట్రలు బయట పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో గెలిపించాలని ఆయన కోరారు.

Views: 6
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*  *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు...
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
మినీ ట్యాంక్ బండ్ కళ ఇకనైనా నెరవేరేనా
మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు పూర్తి కావాలి