రేవంత్ రెడ్డి పోరాట ఫలితంతోనే  బీఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలన అంతం..

On
రేవంత్ రెడ్డి పోరాట ఫలితంతోనే  బీఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలన అంతం..

రేవంత్ రెడ్డి పోరాట ఫలితంతోనే  బీఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలన అంతం..

IMG_20240422_221702
ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..


14 పార్లమెంట్ సీట్లు గెలిపించి రేవంత్ ప్రభుత్వానికి మరింత బలమిద్దాం..
మేడ్చల్ సభలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్..
మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలిన జనం..

ఎల్బీనగర్, ఏప్రిల్రె 22 న్యూస్ ఇండియా ప్రతినిధి: రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన పోరాటం ఫలితంగా పదేళ్ల బీఆర్ఎస్ దుర్మార్గ పాలన ప్రజలు అంతమొందించారని మాధుయాష్కీ గౌడ్ అన్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తున్నాయని.. ఆ పార్టీలను పార్లమెంట్ ఎన్నికలలో ఓడించాలని  టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లతో కలిసి మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ... ఎల్బీనగర్ లో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రస్తావించిన మధుయాష్కి గౌడ్ వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. జీవో నెంబర్ 118 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో  గత ప్రభుత్వం, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేశారని.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. గత ఎన్నికలలో మల్కాజ్గిరి ఎంపీగా  రేవంత్ రెడ్డి ని గెలిపించడంతో.. దుర్మార్గ కేసీఆర్ పాలనపై ఉద్యమించి నేడు సీఎం అయ్యారన్నారు. అలాంటి మల్కాజ్గిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని, సోదరి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 14 పార్లమెంట్ సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం  ద్వారా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యంతో  సీఎం రేవంత్ రెడ్డి  శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన 120 రోజుల లోపలనే  ఇచ్చిన హామీలను  నెరవేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, పరోక్షంగా బిజెపికి కెసిఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. సునీత మహేందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించి  సీఎం రేవంత్ రెడ్డి కి కానుకగా ఇద్దామని ఆయన పేర్కొన్నారు.

 ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలింపు..
 మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా మేడ్చల్ లో జరిగిన  కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో  ఎల్బీనగర్ నియోజకవర్గంలోని  పలు కాలనీలు బస్తీల నుంచి  పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగినది.

Read More టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

భువనగిరిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం : పబ్బు వెంకటేశ్వర్లు భువనగిరిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం : పబ్బు వెంకటేశ్వర్లు
        న్యూస్ ఇండియా తెలుగు, మే 5 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) :కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో భువనగిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
దేశంలో అవినీతి రహిత నియోజకవర్గం గా పెందుర్తిని తీర్చిదిద్దుతాం
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.
మాజీ సీఎం కెసిఆర్ మతిమరుపు మాటలు...
టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు