*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*

*- సాంప్రదాయ పంటల స్థానంలో పామాయిల్ సాగు* *- ఆదర్శంగా నిలుస్తున్న ఆయిల్ ఫామ్ రైతు అంజయ్య* *తొర్రూరు:*

*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*

*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*
*- సాంప్రదాయ పంటల స్థానంలో పామాయిల్ సాగు*
*- ఆదర్శంగా నిలుస్తున్న ఆయిల్ ఫామ్ రైతు అంజయ్య*
*తొర్రూరు:*IMG-20240416-WA0040

ఏటా సాంప్రదాయ పంటల సాగుతో విసిగిపోయిన రైతు తూర్పాటి చిన్న అంజయ్య ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి మూడేళ్లలోనే దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మండల వ్యాప్తంగా 1100 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగవుతుండగా తొలి దిగుబడిని సాధించాడు.
మూడేళ్ల ఆరు నెలల కాలంలో 30 టన్నుల దిగుబడిని సాధించి ఆదర్శంగా నిలిచాడు.
 

మంగళవారం మండలంలోని కంటాయపాలెం శివారులో 30 ఎకరాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ పంట దిగుబడిని 
ఉద్యాన శాఖ డివిజన్ అధికారి రాకేష్ తో కలిసి రైతు, ఎంపీపీ అంజయ్య చూపించారు.

ఈ సందర్భంగా రైతు అంజయ్య మాట్లాడుతూ....

Read More వైన్ షాపులో దొంగలు

పైలెట్ ప్రాజెక్టు కింద 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేశానని,90 శాతం సబ్సిడీతో డ్రిప్ మొక్కలు  అందాయన్నారు. సాగుకై ఎకరాన రూ. 20 వేలు ఖర్చు చేశానని, ఆయిల్ పెడ్, ఉద్యాన శాఖల నుంచి సహకారం అందిందని తెలిపారు. అంతర పంటలుగా పత్తి, పెసర, వేరుశనగ పంటలు వేశానని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి పంట దిగుబడి మొదలైందని ఇప్పటివరకు 30 టన్నుల దిగుబడి సాధించినట్లు తెలిపారు. టన్నుకు రూ.14,437 వస్తుందని, ఆయిల్ పెడ్ వాళ్లే పంటను అశ్వరావుపేట పరిశ్రమకు తరలిస్తారని తెలిపారు.
వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతుల కు రాయితీలు ఇస్తోందన్నారు. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్‌ పాం సాగువైపు దృష్టి సారిస్తున్నారన్నారు.
సాంప్రదాయ పంటలైన వరి , పత్తి వంటి పంటలను సాగు చేసి నష్టపోవడం కంటే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

Read More దేశంలో అవినీతి రహిత నియోజకవర్గం గా పెందుర్తిని తీర్చిదిద్దుతాం

ఈ కార్యక్రమంలో స్థానికులు రాఘవరెడ్డి, సమ్మాల్ తదితరులు పాల్గొన్నారు.

Read More భువనగిరిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం : పబ్బు వెంకటేశ్వర్లు

Views: 50
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..
మధుయాష్కి గౌడ్ కు మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం.. తృటిలో తప్పిన ప్రమాదం.. ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ...
భువనగిరిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం : పబ్బు వెంకటేశ్వర్లు
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
దేశంలో అవినీతి రహిత నియోజకవర్గం గా పెందుర్తిని తీర్చిదిద్దుతాం
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.
మాజీ సీఎం కెసిఆర్ మతిమరుపు మాటలు...