*ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరు ప్రిన్సిపాల్ ను తక్షణమే బదిలీ చేయాలి.*

*ప్రైవేటు కళాశాలలకు తొత్తుగా మారిన ప్రిన్సిపాల్ రాములు.* *సి వై ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు.*

*ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరు ప్రిన్సిపాల్ ను తక్షణమే బదిలీ చేయాలి.*

IMG-20240416-WA0068 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బదిలీపై వచ్చిన నూతన ప్రిన్సిపల్ రాములు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి  విద్యని అందనియకుండా వారిని చదువుకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని సి వై ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు ఆరోపించారు. ఒకటి నాలుగు ఆరవ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజులను కట్టించుకోకుండా స్కాలర్షిప్లు రాలేదని సాకు చెప్పి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించాకే సెమిస్టర్ పరీక్ష ఫీజులు కట్టించుకుంటామని బెదిరించడం సరైన చర్య కాదని అన్నారు. ఎంతో నమ్మకంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత విద్య అందుతుందన్న నమ్మకంతో వచ్చిన విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించటం రాబోవు రోజులలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లను తగ్గించడమే వారి లక్ష్యమని అన్నారు. పరీక్ష ఫీజులు కట్టించుకోమని విద్యార్థులు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కళాశాల ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నీ బదిలీ చేయాలని లేకుంటే కళాశాల మూతపడిపోయే పరిస్థితి, కార్పొరేట్ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు విద్యార్థులు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.

Views: 24
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్ లను మహబూబాబాద్ జిల్లా...
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
దేశంలో అవినీతి రహిత నియోజకవర్గం గా పెందుర్తిని తీర్చిదిద్దుతాం
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.
మాజీ సీఎం కెసిఆర్ మతిమరుపు మాటలు...
టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు
మండల పార్టీకి తెలవకుండా కాంగ్రెస్లో చేరితే పార్టీకి సంబంధం లేదు