కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు..

అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న  బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న వారిపై తప్పుడు ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు..

 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని మడిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలియకుండా తొందరపాటుతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేర్పుల  వెంకన్న అన్నారు. మడిపల్లి గ్రామంలో  గత బి ఆర్ఎస్ ప్రభుత్వంలోనూ... ఏనే గుట్టలు మాయం చేసి... చెరువు, కుంటలలో  నల్లరేగడి మట్టిని ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా అదే విధిగా మడిపల్లి గ్రామంలోమైనింగ్ మాఫియా చేస్తూ... ట్రిప్పుకు 700 నుంచి 800 రూపాయలు వసూళ్లకు పాల్పడుతూ... గ్రామాల్లోని ప్రజల దగ్గర  అధిక మొత్తంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ నిరుపేద, పేద,మధ్యతరగతి కుటుంబాలకు మట్టి రవాణా చేస్తూ వారి దగ్గర నుండి వసులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇట్టి విషయంపై  గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు 400 రూపాయలకే ట్రిప్పు మొరం పోయాలని కోరగా అక్కడ వాగ్వాదంతో గొడవ జరిగినది అని అన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులకు తెలపగా మడిపల్లి గ్రామ కార్యదర్శి మరియు వీఆర్ఏ వచ్చి మట్టి రమణ చేస్తున్న ట్రాక్టర్లను, జెసిబిని అక్కడ నుంచి తరలించడం జరిగినది అని తెలిపారు. అంతేకాకుండా మడిపల్లి గ్రామంలో ఇంకా దొరల పాలన అంతరించి పోలేదని మడిపల్లి గ్రామంలో దొర అని పిలిపించుకుంటూ పేద అమాయక ప్రజలను గొడవలకు దింపుతూ.... అమాయక ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తూ   లేని సమస్యలను ఉన్నట్టుగా సృష్టించే వ్యక్తి రామ సహాయం కృష్ణ  కిషోర్ రెడ్డి అని  ఆయన చొరవ తోటే రెవెన్యూ అధికారులు వెళ్లిపోయిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు మద్యం తాగిపించి మట్టి రవాణా చేయమని చెప్పడంతో.... మళ్లీ ట్రాక్టర్లు, జెసిబి తో మట్టి రవాణా జరుగుతుంటే కొంతమంది గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి  అడ్డుకోవడం జరిగినది.  రెవెన్యూ అధికారుల మాటలు లెక్కచేయకుండా  మళ్లీ ఎందుకు మట్టి రవాణా చేస్తున్నారని వాగ్వాదానికి దిగడంతో గొడవ జరిగినది అని తెలిపారు. ఇట్టి విషయంపై వెన్నంసోమిరెడ్డి మాట్లాడుతూ.... అక్బర్ కు నాకు ఎలాంటి వివాదాలు లేవని గత కొన్ని సంవత్సరాలుగా వారు భూమిని నేనే కౌలుకు చేస్తున్నానని  తెలిపారు. వారికి నాకు ఎలాంటి రాజకీయ గొడవలు కూడా లేవని అతను మధ్య మత్తులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో తోపులాట జరిగిందనిఅన్నారు.ఇట్టి విషయాన్నికొంతమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అభియోగం మోపేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో కొండా ఉపేందర్ రెడ్డి, మహంకాళి సాయమల్లు, వి వెంకటేశ్వర్లు, చల్లా యాదిరెడ్డి, బానోత్  దేవేందర్, జక్కా రామ్ రెడ్డి, వెన్నం అశోక్ రెడ్డి, కమ్మగాని వెంకన్న, సిహెచ్ రవీందర్ రెడ్డి, బండ వీరయ్య  తదితరులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్ లను మహబూబాబాద్ జిల్లా...
తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
దేశంలో అవినీతి రహిత నియోజకవర్గం గా పెందుర్తిని తీర్చిదిద్దుతాం
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.
మాజీ సీఎం కెసిఆర్ మతిమరుపు మాటలు...
టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు
మండల పార్టీకి తెలవకుండా కాంగ్రెస్లో చేరితే పార్టీకి సంబంధం లేదు