గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...

- గణేష్ మండపాల నిర్వాహకులకు - ఎస్ఐ నిరంజన్ రెడ్డి హెచ్చరిక.

On
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...

న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 07 :- వినాయక చవితి సందర్బంగా పెద్దకడుబూరు మండలంలో శనివారం వాడవాడన గణేష్ విగ్రహాలు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా పెద్దకడుబూరులో మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర , బస్టాండ్ తెరుబజారు, చౌడేశ్వరి దేవాలయం , బెగర గేరి దగ్గర మరియు ఎమ్మార్వో ఆఫిస్ దగ్గర ఉన్న గణేష్ విగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పెద్దకడుబూరు గ్రామంలో దాదాపు 25 గణేష్ విగ్రహాలు కోలుదీరాయి. వినాయకుని మండపాలలో గణేష్ విగ్రహానికి శనివారం ఉదయం భక్తులు తొలి పూజలు నిర్వహించారు. వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి ఘనంగా పూజలు చేసారు. భక్తులు పూజ అనంతరం వారికి ఉన్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖశాంతులతో ఉండాలని వినాయకుని, గణేశ్ మహారాజ్ ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో పాడిపంటలతో కలకాలం చల్లగా ఉండాలని గణేశునికి ప్రత్యేక ప్రార్దించారు. గ్రామంలో ప్రజలందరూ ఘనంగా జరుపుకునే గణేష్ పండుగ మూడు రోజులపాటు జరుగుతుంది. సోమవారం వినాయకుడిని నిమజ్జనం ఉంటుంది. పెద్దకడుబూరులో గణేష్ మండపాలను ప్రత్యేకంగా ఎస్ నిరంజన్ రెడ్డి సందర్శించడం జరిగింది. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ విగ్రహం ఏర్పాటు చేసిన మండపాల నిర్వాహకులు ప్రజలు, భక్తులు కలిసిమెలిసి సామరష్యాంతో ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలన్నారు. మండపాల దగ్గరగా ఉన్న కాలనీ వాసులకు ఇబ్బంది కరంగా డీజె సౌండ్స్ పెట్టరాదని మండపాల నిర్వాహకులకు ఎస్ఐ హెచ్చరించారు. గణేష్ పండుగలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడునన్నారు.

Views: 113
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News