క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం..!

- చందుర్తి ఎంపీటీసీ పులి రేణుక సత్యం

On
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం..!

చందుర్తి, జనవరి28, న్యూస్ ఇండియా ప్రతినిధి

క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక దృఢత్వం ఎంతగానో దోహదపడతాయని చందుర్తి ఎంపీటీసీ పులి రేణుక సత్యం అన్నారు.

IMG_20240128_184855చందుర్తి మండల కేంద్రంలో 26 జనవరి పురస్కరించుకొని స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో  క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.. హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను స్థానిక ఎంపిటిసి పులి రేణుక సత్యం చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు... ఈ సందర్భంగా పులి రేణుక సత్యం మాట్లాడుతూ నేటి యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు... క్రీడలతో స్నేహభావం , మానసిక ప్రశాంతతకు దోహదపడతాయన్నారు. యువత పెడదారి పట్టకుండా క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అజ్జు భాయ్, నిర్వహకులు ఓరగంటి వెంకీ, అహ్మద్ పాషా తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

Views: 520
Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News