ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
మహానీయులు ఆశయాలు కొనసాగిస్తా రాయపర్తి మందల పార్టీ అధ్యక్షులు
ఈదులకంటి రవీందర్ రేడ్డి
పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి హనుమాoడ్ల యశశ్విని ఝాన్సీ రేడ్డి ఆదేశాల మేరకు
రాయపర్తి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని,ఉక్కు మహిళ, భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 39వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలు మన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, చిత్రపటానికి పూలమాలు వేసి,అంజలి ఘటించి ఘనంగా 39వ వర్ధంతి వేడుకలు నిర్వహించిన అనంతరం
ఆధునిక భారతదేశ రూప శిల్పి,దేశ సమగ్రత కోసం ఎంతగానో కృషిచేసిన భారత తొలి ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 148 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికీ పుష్పాంజలి ఘటించి, జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రేడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా రవీందర్ రెడ్డీ మాట్లాడుతూ
దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, బ్యాంకుల జాతీయకరణతో దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, ప్రజా ప్రయోజనాల పై దృష్టిసరించి ఉక్కు మహిళగా పేరుగాంచారని కొనియాడారు, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాo అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు హమ్య నాయక్,మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, పాలకుర్తి సోమనాధ ఆలయ చైర్మన్ కృష్ణమాచార్యులు,మండల ఉపాధ్యక్షులు భూక్యా సమ్మయ్య,మండల యూత్ అధ్యక్షులు ఎండీ మహాముద్,అనుబంధ సంఘాల నాయకులు:-మైనారిటీ సేల్ అధ్యక్షులు ఎండీ అఫ్రోజ్,ఏస్టీ సేల్ అధ్యక్షులు గుగులోత్ శ్రీనివాస్,ఏస్సీ అధ్యక్షులు *చిర్ర మల్లయ్య,కిసాన్ సేల్ అధ్యక్షులు నాగేశ్వరరావు,రాయపర్తి టౌన్ అధ్యక్షులు మచ్చ రమేష్,మరియు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List